Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

రష్యా మొదటి టార్గెట్‌ నేనే

మా దేశం ఒంటరిగా మిగిలింది : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ
ష్యా మొదటి టార్గెట్‌ తానేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వారి లక్ష్యం తన కుటుంబమేనని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమకే వదిలేశారని ఆయన వాపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘మా దేశాన్ని కాపాడుకునే విషయంలో మేం ఒంటరయ్యాం. మాతో కలిసి పోరాడేందుకు ఎవరున్నారు? నాకైతే ఎవరూ కనిపించలేదు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరున్నారు? అందుకు అందరూ భయపడుతున్నారు.’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రష్యా దాడిలో ఇప్పటివరకు 137మంది ఉక్రెయిన్‌ పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ వెల్లడిరచారు. వందల మంది గాయపడినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img