Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

రాంచీలో అల్లర్లు.. ఇద్దరి మృతి.. 12 మందికి గాయాలు

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. నిన్న రaార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన అల్లర్లలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. చిరు వ్యాపారుల బండ్లను తగులబెట్టారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. అయితే, ఈ ఘటనల్లో ఇద్దరు గన్‌షాట్‌ వల్ల అయిన గాయాలతో చనిపోయారని, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు నేడు వెల్లడిరచారు. గాయపడిన వాళ్లలో ఎనిమిది మంది నిరసనకారులు, నలుగురు పోలీసులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని, సిటీలో ఆంక్షలను విధించామని తెలిపారు. రేపటి వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశామని జిల్లా అధికారులు ప్రకటించారు. ఘటనపై రaార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. తనకు చాలా సడన్‌ గా ఈ విషయం తెలిసిందన్నారు. రaార?ండ్‌ ప్రజలు సున్నిత మనస్కులని, సహనపరులని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అల్లర్లకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సామరస్యం కోసం పాటుపడాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img