Monday, February 6, 2023
Monday, February 6, 2023

రాందేవ్‌ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

యోగా గురు రాందేవ్‌ బాబా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు చీరలు, సల్వార్‌ సూట్‌లలో అందంగా ఉంటారని బాబా అన్నారు. అక్కడితో ఆగక.. తన కళ్లకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదాన్ని రాజేశారు. ఈ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. యోగాను మార్కెటింగ్‌ చేసే రాందేవ్‌ బాబా మహిళల గురించి దారుణంగా మాట్లాడారని విమర్శించారు. రాందేవ్‌ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళల పట్ల రాందేవ్‌ బాబా వ్యాఖ్యలు సరికాదన్నారు. యోగాను కార్పోరేట్‌ వ్యవస్థగా మార్చారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img