Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం

తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లోని నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను
సోమవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన అందజేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం పేర్కొంది. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులు స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ‘తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించా. దీనిలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ప్రజలు ఆత్మ గౌరవం కోరుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం అరాచకపాలన కొనసాగిస్తోంది. నేను రాజీనామా అంటే కేసీఆర్‌ దిగొస్తున్నారు. నా రాజీనామాతో జరిగే ఉపఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారు. తెలంగాణకు కేసీఆర్‌ నుంచి విముక్తి కల్పిస్తారు.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img