భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 యుద్ధ విమానం సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సూరత్ ఘర్ నుంచి బయలుదేరిన ఈ విమానం హనుమాన్ ఘర్ ప్రాంతంపై నుంచి వెళ్తుండగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. భారత వైమానికదళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం సాంకేతిక సమస్యతో జనావాసాల మధ్య కుప్పకూలింది. సోమవారం ఉదయం రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సౌధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాలతో బయటపడినట్టు పేర్కొన్నారు. సాధారణ శిక్షణలో భాగంగా సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా రాజస్థాన్ హనుమాన్‌ఘర్ సమీపంలోని పిలిబంగా ప్రాంతంలో కూలిపోయింది. పైలట్ సకాలంలో పారాచూట్ ఉపయోగించి విమానం నుంచి దూకాడని, అతడు సురక్షితంగా ఉన్నాడని అధికారులు వివరించారు. ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు.ాసోమవారం ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా ఐఏఎఫ్‌కు చెందిన మిగ్-21 యుద్ధవిమానం సూరత్‌గఢ్ సమీపంలో కూలిపోయింది.. పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాం్ణ అని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. యుద్ధ విమానం కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ాప్రమాదంలో పైలట్ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు.. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేశాడు్ణ అని బికనీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓం ప్రకాశ్ చెప్పారు. మిగ్-21 యుద్ధ విమానం ప్రమాద మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.
తరచూ ప్రమాదాల బారిన పడుతున్న మిగ్-21 విమానాలను తప్పించాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన గతేడాదది కీలక విషయాలను వెల్లడించింది. వాటిని వైమానిక దళం నుంచి తప్పించే ప్రక్రియ.. మొదలుపెట్టామని. 2025 నాటికి.. మిగ్ విమానాలను పూర్తిగా ఉద్వాసన పలుకుతామని పేర్కొంది.
ప్రస్తుతం మన దేశం వద్ద నాలుగు స్క్వాడ్రాన్ల మిగ్-21 విమానాలున్నాయి. ఒక్కో స్క్వాడ్రాన్‌లో 16 నుంచి 18 మిగ్ విమానాలుంటాయి. తొలుత శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే 51 స్వార్డ్ ఆర్మ్స్ స్క్వాడ్రాన్‌కు వీడ్కోలు పలికి.. అనంతరం రాజస్థాన్‌లోని ఉత్తర్‌లాయి, సూరత్‌గఢ్, నాల్ కేంద్రంగా పనిచేసే మూడు స్కాడ్రాన్క్‌లకు కూడా రాబోయే రోజుల్లో వీడ్కోలు పలకుతామని చెప్పింది.