Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

రాజ్యసభలో భావోద్వేగానికి గురైన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంటు ఒక దేవాలయం లాంటిదని , కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా ప్రవర్తించారన్నారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే అన్నారు. ఈ పరిణామాలు తలుచుకుంటే రాత్రి నిద్రపట్టలేదు, చాలా దురదృష్టకరమైన పరిస్థితని అన్నారు. మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్‌ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఓ ఎంపీ ఏకంగా చైర్మన్‌ సీటుపైకి ఫైల్స్‌ విసిరేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్రంగా కలత చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img