Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

రాయపూర్‌ రైల్వేస్టేషన్‌లో పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలు


ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. రైలు బోగీలో జరిగిన పేలుడులో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. .సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 211 బెటాలియన్‌ జవాన్లు ప్రత్యేక రైలులో జమ్మూ వెళుతుండగా డమ్మీ క్యాట్రిడ్జ్‌ బాక్స్‌లో ఉంచిన గ్రెనేడ్‌ రైలు బోగీలో ఉంచగానే పేలింది. ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తున్న రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడిరచారు.సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.ఈ పేలుడు ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img