Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

రాష్ట్రంలో పెన్షన్ల పెంపునకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం

రూ.2,500 నుంచి రూ.2,750కి పెరిగిన పెన్షన్‌
సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్‌ సమావేశం
పలు నిర్ణయాలకు ఆమోదం

సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో… ఇప్పుడిస్తున్న పెన్షన్‌ పై రూ.250 పెరగనుంది. తద్వారా పెన్షన్‌ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగనుంది. పెంచిన పెన్షన్లు 2023 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో పెన్షన్‌ అందుకుంటున్నవారు 62.31 లక్షల మంది ఉన్నారు. అటు నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ క్లాస్‌ రూంలు, ఫౌండేషన్‌ స్మార్ట్‌ టీవీ రూంలను నిర్మించే ప్రతిపాదన, వైఎస్సార్‌ పశు బీమా పథకం ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ కు కూడా క్యాబినెట్‌ ఆమోదం లభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img