Monday, October 3, 2022
Monday, October 3, 2022

రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం: చంద్రబాబు

ఇప్పటిదాకా పొత్తుల గురించి మాట్లాడలేదన్న చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొత్తులపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టత నిచ్చారు.ఇతర పార్టీలతో టీడీపీ పొత్తుల గురించి తాను ఇప్పటిదాకా మాట్లాడలేదని ఆయన వెల్లడిరచారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని… నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికోసం పనిచేసి నమ్మకం పెంచాలని ఆదేశించారు. మన పోరాటం పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఉంటే ఇక భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికలు త్వరగా వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. నెత్తిన ఉన్న కుంపటిని ఎప్పుడెప్పుడు దింపుకుందామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పోరాడే నేతలు మరింత మంది తయారు కావాల్సి ఉందని, పార్టీలోని సీనియర్లు అలాంటి నేతలను తయారు చేసే బాధ్యతలను తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img