Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

రాష్ట్రపతి రేసులో లేను…ఎన్సీపీ అధినేత స్పష్టం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న వేళ..నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని పవార్‌ నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడిరచాయి. సోమవారం రాత్రి ముంబై నగరంలో జరిగిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) సమావేశంలో శరద్‌ పవార్‌ మాట్లాడారని సమాచారం. ‘‘నేను రాష్ట్రపతి పదవి కోసం రేసులో లేను, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కాను’’ అని శరద్‌ పవార్‌ స్పష్టంగా చెప్పారు. 81 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి అయిన శరద్‌ పవార్‌ అధికారికంగా తన తిరస్కరణను కాంగ్రెస్‌ పార్టీకి తెలియజేయలేదు.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవసరమైన మెజారిటీని సాధించగలవనే నమ్మకం శరద్‌ పవార్‌కు లేదని ఎన్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే పోరులో పోటీ చేయడానికి శరద్‌ పవార్‌ మొగ్గు చూపడం లేదని ఆయన పార్టీ వర్గీయులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img