Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

రాష్ట్ర బంద్‌ పిలుపు నేపథ్యంలో టీడీపీ నేతల గృహనిర్బంధాలు..ముందస్తు అరెస్టులు


పలుచోట్ల ఉద్రిక్తతలు..


టీడీపీ కార్యాలయాలపై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు గృహదిగ్బంధం చేస్తున్నారు. పలుచోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద పోలీస్‌ పహారా నిర్వహించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు పట్టాభి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రోజు లేదా రేపు అరెస్టు చేసే అవకాశం ఉంది. నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీస్‌ ఉన్నత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
బంద్‌ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులను తిరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఎంపీ రామ్మోహన్‌ నాయుడును, పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టెక్కలిలో బంద్‌ చేపట్టేందుకు రోడ్డు మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖలో ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అదేవిధంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావును స్వగ్రామం రాజాంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ అ మండల కేంద్రాలలో పలువురు టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు హౌస్‌ అరెస్టు చేశారు. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.మాజీ మంత్రి చినరాజప్ప పెద్దాపురంలో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి రోడ్లపై ర్యాలీ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ చినరాజప్ప తన ర్యాలీ కొనసాగించారు. వీధులన్నీ తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమగోదారి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిరది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి దగ్గర రచ్చ జరిగింది. నిమ్మలను హౌస్‌ అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులు, నిమ్మల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరికి నిమ్మల రామానాయుడు ఇంటి నుంచి బయటికి వచ్చారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడలో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించడంతో అరెస్టు చేశారు. .బుద్దా వెంకన్న అరెస్ట్‌ సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బుద్దా చొక్కా కూడా చిరిగిపోయింది. చివరికి బుద్దాను బలవంతంగా జీపు ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల నిరసనల నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. నర్సరావుపేటలో టీడీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ అరవిందబాబును అరెస్టు చేసి ఆయన్ను శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నేతలు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు`కడప జాతీయరహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. రాయలసీమ జిల్లాల్లోనూ ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల టీడీపీ నేతలను గృహదిగ్బంధం చేశారు. కడప జిల్లా రాజాంపేటలో బస్సులను అడ్డుకున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సహా పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img