Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?

హోదా, విభజన హామీలేమయ్యాయి…
కేంద్రంపై ఒత్తిడిలో వైసీపీ, టీడీపీ విఫలం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు దాటినా మోదీ సర్కారు ఒక్క హామీ అమలు చేయలేదు. మరోవైపు, రాష్ట్రానికి చెందిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన…హోదా, విభజన హామీల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ మూడు పార్టీలు బీజేపీని ప్రశ్నించడానికి సిద్ధంగా లేవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనైనా రాష్ట్ర ఎంపీలు గళం వినిపించే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో మాత్రం పరస్పర విమర్శలు చేసుకోవడానికి ఈ మూడు పార్టీలు వెనుకాడటం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటి వరకు పార్లమెంటు సమావేశాల సమయంలోనే హోదా, విభజన హామీలపై హడావుడి చేశారు. ఆ తర్వాత అందరూ మౌనమే. దీంతో రాష్ట్రాభివృద్ధికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. 2014 నుంచి టీడీపీ కానీ, 2019 నుంచి వైసీపీ కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం పనిచేయడం లేదు. ప్రత్యేకించి మోదీ సర్కారును నిలదీయడానికి రెండు పార్టీలు భయపడుతున్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మాత్రమే స్పందిస్తున్నాయి. మోదీ సర్కారుకు అధికార వైసీపీ పరోక్షంగా అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తోంది. లోక్‌సభ, రాజ్యసభల్లో మోదీ సర్కారు ప్రవేశపెట్టే బిల్లులకు నిస్సిగ్గుగా మద్దతిస్తోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఆర్థికంగాను, సాంకేతికంగాను సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ చేసిన ప్రకటనపై నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. విభజన హామీలను బీజేపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోగా, విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయడానికి మోదీ సర్కారు చేస్తున్న కుట్రలపై ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కడప జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. సీఎం సొంత జిల్లా అయిన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాబోదని కేంద్రం ప్రకటించినా జగన్‌ ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్‌ సర్కారు విఫలమైందని వామపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కడపలో రాష్ట్ర ప్రభుత్వమే సాంతంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తుందనే తరహాలో ఆర్భాటంగా సీఎం జగన్‌ భూమిపూజ చేసినప్పటికీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలకు వైసీపీ మద్దతిచ్చినప్పటికీ చట్టసభల్లో ఎంపీలు గట్టిగా స్పందించిన సందర్భాలు కనిపించడం లేదు.
కేంద్రానికి దాసోహం
రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీస్తోంది. పార్లమెంటులో సైతం బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా…రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ, టీడీపీ సభ్యులు మౌనంగా ఉండిపోవడం దారుణం. ఆ రెండు పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి సాగిలపడటమే దీనివెనుక గల ప్రధాన కారణమని విమర్శలు ఉన్నాయి. వైసీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు సైతం రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. రాష్ట్ర హక్కుల్ని హరించేలా వ్యవహరిస్తున్న బీజేపీకి వైసీపీ సహకరించడాన్ని వామపక్ష, కార్మిక, ప్రజా

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img