Friday, March 31, 2023
Friday, March 31, 2023

రాహుల్‌కు చరిత్ర తెలియదు: రాజ్‌నాథ్‌

గోండా: నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చైనా, పాకిస్థాన్‌ బాగా దగ్గరయ్యాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందించారు. ప్రాచీన భారతదేశ చరిత్రను రాహుల్‌ చదవలేదని, కనీసం నవీన భారతదేశ చరిత్రనైనా చదివితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఎన్నికల ప్రచారసభలో రాజ్‌నాథ్‌ శనివారం మాట్లాడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే అక్రమంగా స్వాధీనం చేసుకుని సక్సగమ్‌ లోయను చైనాకు పాకిస్థాన్‌ అప్పగించిందని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కరకోరం జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారని, సీపీఈసీ మొదలైనప్పుడు మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నారని, ఆ సందర్భాలు జరిగిన్పుడు మోదీ ప్రధాని కాదని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img