Monday, August 15, 2022
Monday, August 15, 2022

రాహుల్‌గాంధీని 3 గంటలు ప్రశ్నించిన ఈడీ…

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని దాదాపు 3 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) విచారించింది.సుమారు 3 గంటల సేపు విచారణ సాగింది. రాహుల్‌ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణలో రాహుల్‌పై పలు ప్రశ్నల వర్షం కురిపించింది. అసోసియేట్‌ జనరల్‌ సంస్థలో రాహుల్‌ గాంధీ హోదా, యంగ్‌ ఇండియన్‌ సంస్థతో ఉన్న సంబంధమేంటి అనే అంశంపై ముఖ్యంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యంగ్‌ ఇండియన్‌ సంస్థకు కాంగ్రెస్‌ నుంచి ఎందుకు రుణాలిచ్చారని రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు అడిగారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.ఈ కేసులో రాహుల్‌ గాంధీ వాంగ్మూలం రికార్డు చేసిన ఈడీ మళ్లీ విచారణకు పిలుస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దిల్లీలో ర్యాలీ చేపట్టిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img