Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

లెఫ్ట్‌ నేతల నిర్బంధం

వీఎంసీ వద్ద ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
సీపీఐ, సీపీఎం నేతల హౌస్‌ అరెస్ట్‌
రామకృష్ణ, మధు, దేవినేని ఉమా పరామర్శ
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నేతల హెచ్చరిక

విశాలాంధ్ర`విజయవాడ : ప్రజలకు పెనుభారంగా మారనున్న ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట ధర్నాకు సిద్ధమైన సీపీఐ, సీపీఎం నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక క్కడే నాయకులను నిర్బంధించారు. రాత్రి నుంచే గృహనిర్బ ంధంలో ఉంచారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూ రావు, కాశీనాథ్‌తోపాటు అనేకమంది నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేర ని, జీవో నంబర్లు 196, 197, 198 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టంచేశారు.
రాత్రి నుంచే హౌస్‌ అరెస్టులు…
ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచాలని ప్రభుత్వం జీవో నంబర్‌ 198 జారీ చేసింది. ఈ జీవోపై చర్చించి, ఆమోదం తెలిపేందుకు గురువారం విజయవాడ నగరపా లక సంస్థ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశం సందర్భంగా జీవో నంబర్‌ 198 రద్దు చేసి, ప్రజలపై భారాలు మోపకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం అధ్వర్యాన కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే, ధర్నాను అడ్డుకునేందుకు అధికారపక్షం ఫిర్యాదు మేరకు సీపీఐ, సీపీఎం నేతలను బుధవారం రాత్రి నుంచే పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దోనేపూడి శంకర్‌ సీపీఐ నాయ కులు డీవీ రమణబాబు, కొట్టు రమణారావు, నక్కా వీరభద్ర రావు, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు, మూలి సాంబశివ రావు, కె.కోటేశ్వరరావు, పడాల కనకారావు, కేఆర్‌ ఆంజనేయులు, గంధవరపు వెంకట్రావు, టి.పూర్ణ య్య, తిప్పాబత్తుల వెంకటేశ్వరరావు, పడిగికత్తుల రాము, కె.వాసు, గూడెల జనార్ధన్‌, జి.సింహాచలం, రాయన గురునాథం, మురుగేశన్‌ రాములను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నాయకులు లంకా దర్గారావు, తాడి పైడియ్య, సంగుల పేరయ్య, అప్పురబోతు రాము, కేవీ భాస్కరరావు, ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ, టి.తాతయ్య, ఎండీ మొయినుద్దీన్‌, దుర్గాశి రమణమ్మ తదితరులను రాత్రి నుండే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు దోనేపూడి తరలింపు
దోనేపూడి శంకర్‌ను బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కృష్ణలంకలోని ఆయన గృహంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని ధర్నాకు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ఆయన్ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌ తదితరులను కూడా స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి సంఫీుభావంగా సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ తాము వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ధర్నా చేయాలని ప్రయత్నించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి ప్రజలపై భారం మోపవద్దని శాంతి యుతంగా నిరసన తెలియజేయాలని భావించామని చెప్పా రు. అధికార పక్షం ఫిర్యాదుతో తమను నిర్బంధించడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంస్కరణల్లో భాగంగా రూ.2,500 కోట్లు వస్తాయనే ఉద్దేశ ంతో వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజలపై రూ.10వేల కోట్లకు పైగా భారాలు మోపేందుకు 196, 197, 198 జీవోలు జారీ చేసిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బాబూరావు, కాశీనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. ప్రజలపై అడ్డగోలుగా భారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామన్నారు.
రామకృష్ణ, మధు, దేవినేని ఉమ పరామర్శ
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ పరామర్శించారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని నిర్ణయించిన నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రామకృష్ణ మాట్లాడుతూ తమకు అవసరమైన పద్ధతుల్లో చర్చించి పన్నులు పెంచుకునే స్వేచ్ఛ స్థానిక సంస్థలకు ఉందని, అవసరమైతే ప్రభుత్వం సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల హక్కులను హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే బలవంతంగా ఆస్తి పన్ను, చెత్తపన్ను, డ్రెయినేజీ పన్ను పెంచుతూ జీవోలు జారీ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఉద్యమకారులను అరెస్టు చేయడం, స్థానిక సంస్థలపై పెత్తనం చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గుర్తించాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img