దోషులను తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ డిమాండ్
న్యూదిల్లీ: త్రిపురలో లెఫ్ట్ నేతలపై ఫాసిస్టు దాడులకు తెగబడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు హితవు పలికింది. మరోమారు నేతలపై దాడులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని త్రిపుర సీఎంకు సూచించింది. ఎన్నికల హింసపై విచారణ కోసం ఆ త్రిపురలో పర్యటించిన లెఫ్ట్`కాంగ్రెస్ ప్రతినిధుల బృందంపై బీజేపీ వర్గాల దాడిని శనివారం ఓ ప్రకటనలో సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. దోషులను ఉపేక్షించరాదని పేర్కొంది. ‘బీజేపీ ఫాసిస్టు దాడి ప్రభావం వెయ్యి మందిపై, వామపక్ష నేతల 20 దుకాణాలపై కనిపించింది. వర్కర్లపై దాడులు జరిగాయి. నిప్పంటించడం, దోచుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు చనిపోయారు. వామపక్ష, కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఎన్నికల హింస బాధితులతో మాట్లాడే క్రమంలో బీజేపీ గూండాలు వారిపై దాడి చేశారు. తద్వారా బీజేపీ ఫాసిస్టు రాజకీయాలు మరింతగా బహిర్గతమయ్యాయి’ అని సీపీఐ విమర్శించింది. త్రిపురలోని సెపాహిజాల జిల్లాలోని బిషాల్‌గఢ్ సబ్‌డివిజన్‌లోని సరిహద్దు గ్రామమైన నేహల్‌చంద్ర నగర్‌లో వామపక్ష, కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతినిధుల బృందంపై బీజేపీ మద్దతుదారులు దాడికి పాల్పడటం ఆక్షేపణీయమని పేర్కొంది. బృంద సభ్యుల్లో సీపీఐ ఎంపీ వినయ్ విశ్వం, పార్టీ జాతీయ కార్యదర్శి ఇల్మారం కరీం, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజ్, వికాశ్ రంజన్ భట్టాచార్య, ఏఏ రహీం ఉన్నారు. వీరంతా త్రిపుర మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్‌తో కలిసి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ఆరా తీసేందుకు వెళ్లినట్లు తెలిపింది.