Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

వంద రోజులు…ఐదు కొత్త పాలసీలు

నాలుగు ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక క్లస్టర్లు
ప్రోత్సాహకాలపై సానుకూల నిర్ణయం
వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు: సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాబోయే 100 రోజుల్లో కొత్తగా ఐదు నూతన పాలసీలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానం, ఎంఎస్‌ఎంఈ విధానం, ఆహారశుద్ధి విధానం, ఎలక్ట్రానిక్‌, ఐటీక్లౌడ్‌ పాలసీ, టెక్స్‌టైల్‌ పాలసీ తీసుకురావాలని, అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై బుధవారం వెలగపూడి సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ఎనర్జీ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో విధానాలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు. కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లస్టర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రం అనుమతులు పొందాలన్నారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఆయా క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హార్డ్‌వేర్‌ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్స్‌ ప్రగతిపై అధికారులతో చర్చించారు. నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌డ్రగ్‌ పార్క్‌, రూ.60 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. పదేళ్లలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా… తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలు రద్దు చేసుకున్నాయని, కొత్త కంపెనీలు రాలేదని, మళ్లీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములనూ ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ…పరిశ్రమలకు కేటాయించిన స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు గత టీడీపీ ప్రభుత్వం 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే… వైసీపీ ప్రభుత్వం 34 శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని, తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2014-2019 కాలంలో 64 పారిశ్రామిక పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే… 2019-2024 మధ్య కేవలం 31 పార్కులు వచ్చాయని సీఎం వివరించారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని, నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని సీఎం చెప్పారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, తద్వారా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిచేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరలు తగ్గించి, పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వివాదాల్లోకి నెట్టేసి నిర్వీర్యం చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img