కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త వినిపించాయి. చమురుసంస్థలు 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.91.5 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. . అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడకందారులకు ఇటువంటి ఉపశమనం లభించలేదు. ఈ నూతన ధరలు మంగళవారం (ఫిబ్రవరి ఒకటి)నుంచి అమల్లోకి రానున్నాయి. రాయితీపై లభించే గృహ వినియోగ ఎల్‌పీజీ 14.2 కేజీల సిలిండర్ ధర యథావిథిగానే ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,076 నుంచి రూ.1,987కు తగ్గింది. ముంబైలో ఈ సిలిండర్ ధర రూ.1,948 నుంచి రూ.1,857కు తగ్గింది.