Friday, September 22, 2023
Friday, September 22, 2023

వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు

వాతావరణాన్ని తట్టుకునే 35 వంగడాలను విడుదల చేసిన ప్రధాని
వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలను ప్రధాని మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులపై పోరాటాన్ని మరింత పెంచవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. ఈ వంగడాలను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) అభివృద్ధిపరచింది. వాతావరణ మార్పులు, పోషకాహార లోపం సవాళ్ళను ఎదుర్కొనగలిగేలా వీటిని అభివృద్ధిపరిచింది. కొమ్ము శనగలు, కందులు, సోయాబీన్‌, వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న, క్వినోవా, బక్‌వీట్‌ (ఒక తరహా గోధుమలు) వంటివాటిని అభివృద్ధి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img