Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం : ప్రధాని మోదీ

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాంటి వాటికి బీజేపీలో ఎన్నటికీ స్థానం లేదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అంతేగాక ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం తానేనని మోదీ ఈ సందర్భంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడిరచాయి. ఇవాళ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలతో పలు విషయాలను ఆయన చర్చించారు. ‘‘పార్టీలో కుటుంబ రాజకీయాలు పనిచేయవు. ఇతర పార్టీల్లోని వారసత్వ రాజకీయాలపై మనం పోరాడాలి. కాబట్టి పార్టీలోని నేతల వారసులకు టికెట్లు ఇవ్వకపోతే చింతించొద్దు. అలా జరగడానికి పూర్తి బాధ్యత నాదే. వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకం కదా?’’ అని మోడీ సూచించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, ఎంపీలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img