Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

వాహనదారులకు కాస్త ఊరట..

వాహనదారులకు ప్రభుత్వ చమురు సంస్థలు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు 15పైసలు చొప్పున తగ్గించాయి. తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.49, డీజిల్‌ ధర రూ.88.92కు చేరింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగడమే కాకుండా, కొంతమేరకు తగ్గుతూ వస్తున్నాయి.దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢల్లీిలో పెట్రోల్‌ రూ.101.49.. డీజిల్‌ రూ.88.92, ముంబైలో పెట్రోల్‌ రూ.107.52.. డీజిల్‌ రూ.96.48గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ రూ.99.20.. డీజిల్‌ రూ.93.52, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 101.82.. డీజిల్‌ రూ.91.98, భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.91.. డీజిల్‌ రూ.97.72, రాంచీలో పెట్రోల్‌ రూ.96.47.. డీజిల్‌ రూ.93.86గా ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ రూ.104.98.. డీజిల్‌ 94.34, పాట్నాలో పెట్రోల్‌ రూ.103.99.. డీజిల్‌ రూ.94.75, చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.97.66.. డీజిల్‌ రూ.88.62, లక్నోలో పెట్రోల్‌ రూ.98.56.. డీజిల్‌ రూ.89.29, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.54.. డీజిల్‌ రూ.96.99గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img