Monday, January 30, 2023
Monday, January 30, 2023

వికసించిన ‘పద్మ’లు

ఏడు పద్మ విభూషణ్‌, పది పద్మభూషణ్‌,102 పద్మశ్రీల ప్రదానం
సుదర్శన్‌ సాహూ, సుమిత్రా మహాజన్‌కు అవార్డులు

న్యూదిల్లీ : 2021 సంవత్సరానికి ‘పద్మ’లు వికసించాయి. వేర్వేరు రంగాల్లో గణనీయమైన తోడ్పాటు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతో సన్మానించడం ఆనవాయితీ. ఈ ఏడాదికి ప్రకటించిన పద్మ అవార్డులను సంబంధిత వ్యక్తులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బహూకరించారు. కోవిడ్‌19 పరిస్థితి నేపథ్యంలో రెండు భాగాలుగా అవార్డుల ప్రదానం సాగింది. ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఆర్స్ట్‌ (కళలు), సోషల్‌ వర్క్‌ (సంఘసేవ), పబ్లిక్‌ అఫైర్స్‌ (ప్రజావ్యవహారాలు), సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ, మెడిసిన్‌, లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ (క్రీడలు), సివిల్‌ సర్వీస్‌ విభాగాల్లో సేవలు అందించిన వారిని అవార్డులతో సన్మానిస్తారు. ఈఏట ప్రముఖ ఆర్కియాలజిస్టు ఆర్కియాలజిస్టు బీబీ లాల్‌, కార్డియాలజిస్ట్‌ బెల్లే మొనప్ప హెగ్డే (మెడిసిన్‌), సైన్స్‌ఇంజినీరింగ్‌ విభాగంలో నరీందర్‌ సింగ్‌ కపానీ (మరణానంతరం), కళల్లో శిల్పి సుదర్శన్‌ సాహూను పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. పద్మభూషణ్‌ అందుకున్న వారిలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, బ్యూరోక్రాట్‌ న్రిపేంద్ర మిశ్రా, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గగోయ్‌ (మరణానంతరం), రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, గుజరాత్‌ మాజీ సీఎం కేశుభాయ్‌ పటేల్‌ ఉన్నారు. అలాగే, పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో సరోద్‌, అఫ్గాన్‌ రబానీ కళాకారుడు ఉస్తాద్‌ గుల్ఫమ్‌ అహ్మద్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి పి.అనితా, అసోం బ్యాంకర్‌ లక్ష్మిబారువా, రజనీ బెక్టార్‌, కళాకారుడు, లఢక్‌ సామాజిక కార్యకర్త సుట్రిమ్‌ చన్జోర్‌, బీహార్‌ పెయింటర్‌ దులారీ దేవి, నాట్యకళాకారుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఐయు భుయాన్‌, గుజరాతీ కవి, జానపద గాయకుడు దాదుదాన్‌ గాధ్వీ (మరణానంతరం), హరియాణా ప్రొఫెసర్‌ జై భగవాన్‌ గోయల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్వాతారోహకుడు డాక్టర్‌ అన్షు జంసేపా, జానపద గాయని పునమసి జాని, రచయిత నామ్‌దేవ్‌ చంద్రభాన్‌ కాంబ్లే, డాక్టర్‌ రజల్‌ కుమార్‌ కర్‌, పంజాబ్‌కు చెందిన ప్రకాశ్‌ కౌర్‌, ప్రముఖ పప్పెటీర్‌ కె.కేశవస్వామి, ఫుల్కారి కళాకారిణి లాజ్‌వంతి, లాఖా ఖాన్‌, దులాల్‌ మంకీ, చంద్రకాంత్‌ మెహతా, కైథాప్రాం దామోదర్‌ నంబూద్రీ, డాక్టర్‌ చంద్రకాంత్‌ సాంభాజీ పాండవ్‌, డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే, జర్నలిజంలో ప్రొఫెసర్‌ సుందరం సోలోమాన్‌ పాపయ్య, జాశ్వంతి బేన్‌ జన్మదాస్‌ పోపట్‌, అసోం సామాజిక కార్యకర్త డాక్టర్‌ బీరుబాలా రాభా, రామస్వామి అన్నవరపు, కర్ణాటిక్‌ గాయకులు బాంబే జయశ్రీరాంనాథ్‌, డాక్టర్‌ ధనుంజయ్‌ దివాకర్‌ సగ్దేవ్‌Ñ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ భూపేంద్ర కుమార్‌ సింగ్‌ సంజయ్‌, ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌ సాప్రూ (మరణానంతరం), హంజమాన్‌ ఓంగ్బీ రాధె, డాక్టర్‌ అర్జున్‌ సింగ్‌ షెఖావత్‌, ప్రొఫెసర్‌ రామ్‌యత్న శుక్లా, జితేంద్ర సింగ్‌ షుంటి, సుధా సింగ్‌, మాజీ గవర్నర్‌ మృదులా సిన్హా, పశ్చిమ బెంగాల్‌ సామాజిక కార్యకర్త గురుమా కమలి సోరెన్‌, డాక్టర్‌ తిరువేవంగడం వీరరాఘవన్‌ (మరణానంతరం), డాక్టర్‌ కపిల్‌ తివారీ, దివ్యాంగ క్రీడాకారుడు కేవై వెంకటేశ్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఖాజీ సజ్జద్‌ అలీ జాహిర్‌ ఉన్నారు.
తెలుగుతేజాలు..
తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మశ్రీ అవార్డును అందుకోగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామస్వామి అన్నవరపు, ప్రకాశ్‌ రావు అనపడి, నిముమోలు సుమతిÑ తెలంగాణకు చెందిన కనకరాజు ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఏడు పద్మవిభూషణ్‌లు, పది పద్మభూషణ్‌, 102 పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి బహూకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img