ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ థర్మల్ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్ వైరు తెగింది.. దీంతో లిఫ్ట్ ఊడి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మిగిలిన వారికిగాయాలు అయ్యాయి.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో లిఫ్ట్ ఎనిమిది మంది ఉన్నట్టు తెలుస్తోంది..ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతున్నారు. చనిపోయిన కార్మికుల మృతదేహాలను వీటీపీఎస్ బోర్డు ఆసుపత్రికి తరలించారు.. మృతులు జార్ఖండ్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన మాత్రమే ప్రమాదం జరిగిందని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బోర్డు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.