పరీక్షలు, ఫలితాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ఇంటర్ విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ‘టెలీ- మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ‘టెలీ-మానస్’ పేరుతో సైకాలజిస్టుల సేవలు అందించనుంది. ఇంటర్ విద్యార్థులు మానసికి ఒత్తిడిని జయించేందుకు ఈ సేవలు పయోగపడనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్ 14416కు ఫోన్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని పేర్కొంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి ఉచితంగా మానసిక వైద్యులను సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈమేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉచితంగా సైకాలజిస్ట్ కన్సల్టేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడిరచారు. సాత్విక్ ఘటన, మార్చి 15 నుంచి జరగబోయే ఇంట ర్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.