Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం..

గేట్‌ 2022 వాయిదాపై దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ను తాత్కాలికంగా వాయిదావేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీం కోర్టు గురువారం (ఫిబ్రవరి 3)న తోసిపుచ్చింది. కోవిడ్‌-19 మహమ్మారి థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. పరీక్షకు కేవలం 48 గంటల ముందు పిటీషన్‌ను విచారించడం విద్యార్థుల్లో గంధరగోళానికి దారితీస్తుందని డివై చంద్రచూడ్‌, సూర్యకాంత్‌, వికమ్‌ నాథ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘మేము పరీక్షలను వాయిదా వేయలేము. కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో దేశంలో పలు విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయి. అంతేకాకుండా పిటీషన్‌లో పేర్కొన్న విషయాలు అధికారులు నిర్ణయించాల్సిన విద్యాపరమైన అంశాలు. కోర్టులు ఈ రంగంలో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం. విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఈ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. దీనిపై కొందరు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పరీక్షకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టు స్టే విధించినట్లయితే, అది గందరగోళానికి దారితీస్తుంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు..పిటిషనర్‌ తరఫు న్యాయవాది సత్పాల్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘చాలా రాష్ట్రాలు వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాయని, ఇటువంటి పరిస్థితిలో పరీక్షను నిర్వహించడం అన్యాయమని, పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని’’ కోరారు. అందుకు సమాధానంగా ‘‘ఒక నెల తర్వాత పరిస్థితి మెరుగ్గా ఉంటుందని మాకు ఏవిధంగా తెలుస్తుందని?’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ‘‘అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రాష్ట్రాలకు సమస్యలు ఉంటే.. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరి కెరీర్‌లతో మనం ఆడుకోవడం సమంజసం కాదని’’ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.కోవిడ్‌ మహమ్మారి పరిస్థితి కారణంగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష (గేట్‌)ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించిన విషయం తెలిసింది. ఈ పిటీషన్‌ను ఈ రోజు విచారించన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు పిటీషన్‌ను కొట్టివేసింది.కాగా గేట్‌ 2022 పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరగనుండగా పరీక్షలను వాయిదావేయాలని బుధవారం (ఫిబ్రవరి 2)న సుప్రీంకోర్టులో పిటీషనల్‌ దాఖలైంది. శనివారం ప్రారంభమయ్యే పరీక్షకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అడ్మిట్‌ కార్డులు కూడా జారీ అయ్యాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 200 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img