Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

‘విద్యుత్‌ బిల్లు’పై రాష్ట్రాల నిరసన గళం

మొండిగా ముందుకు వెళ్లేందుకు కేంద్రం యత్నం
మోదీ ప్రభుత్వ ‘ప్రైవేటీకరణ’ చర్యలను ఖండిస్తున్న విపక్షాలు

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభు త్వం ‘ప్రైవేటీకరణ’ చర్యలను ముమ్మరం చేసింది. సంస్కరణల పేరుతో ఒక్కొక్క రంగాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌ రంగంలో ప్రత్యేకించి విద్యుత్‌ పంపిణీకి సంబంధించిన సంస్క రణలను ముందుకు తీసుకువ స్తుంది. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అనేకం దానిని వ్యతిరేకిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు విద్యుత్‌ చట్టం2003కు చేసిన సవరణలపై తమ నిరసన గళం వినిపించాయి. విద్యుత్‌ ఇంజినీర్లు, ఉద్యోగులు సైతం ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో ప్రతిపాదిత కొత్త బిల్లును సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముందు, ఇది క్యాబినెట్‌ ఆమోదం కోసం కూడా పంపించింది. ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లు 2003కు సంబంధించిన మొదటి సవరణల ముసాయిదాను తీసుకువచ్చింది. రాష్ట్రాలను తమ అభిప్రాయాలను సమర్పించమని కోరింది. సబ్సిడీ విద్యుత్‌ రేట్లకు ముగింపు పలకడం సహా పారిశ్రామిక వినియో గదారులపై క్రాస్‌-సబ్సిడీ భారం తగ్గింపు, కొత్త కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ, ఇప్పటికే ఉన్న రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌లు (ఎస్‌ఈఆర్‌సీలు) కొత్త ఎంపిక ప్రక్రియను ప్రధాన సవరణలలో చేర్చింది. ఫిబ్రవరిలో కేంద్రం విద్యుత్‌ ‘పంపిణీ లైసెన్స్‌’ను రద్దు చేయడానికి ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ చట్టం2003ను మరింత సవరిం చింది. అవసరమైన నియంత్రణ ఆమోదం తర్వాత ఏ ప్రాంతంలోనైనా విద్యుత్‌ సరఫరా చేయడానికి ఏదైనా కంపెనీని అనుమతించింది. దీంతో కేంద్రం ఇప్పటికే ప్రభుత్వ యాజమా న్యంలో ఎక్కువగా ఉన్న విద్యుత్‌ పంపిణీ కంపెనీల (డిస్కమ్‌ల) గుత్తాధిపత్యాన్ని ముగించింది. ప్రతి

ప్రాంతాన్ని ప్రైవేట్‌ డిస్కమ్‌లకు అందించడానికి వీలుగా సవరణలను తీసుకువచ్చింది. కాగా విద్యుత్‌ చట్టానికి సవరణ చేసేందుకు కొత్త బిల్లును రూపొందించింది. ఈ మార్పు కేంద్రం, రాష్ట్రాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల విలువైన రెండవ విద్యుత్‌ పంపిణీ సంస్కరణను ఆవిష్కరించిన సమయంలో ఈ సవాలు వచ్చింది. 2014లో ప్రారంభించిన చివరి డిస్కమ్‌ల సంస్కరణ పథకం ఉదయ్‌ 2020 సంవత్సరంలో ముగిసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్‌ల కోసం గత దశాబ్దంలో మొత్తం నాలుగు సంస్కరణలు లేదా ఆర్థిక పునర్నిర్మాణ పథకాలు వచ్చాయి.
అయితే విద్యుత్‌ చట్టంలో సూచించిన మార్పులతో అనేక రాష్ట్రాలు ఇప్పుడు విద్యుత్‌ రంగం సమాఖ్య నిర్మాణాన్ని ఉదహరిస్తూ కేంద్రంపై విమర్శలు సంధిస్తున్నాయి. దీనిలో ఉత్పత్తి, ప్రసారం కేంద్రం కిందకు వస్తుంది. పంపిణీ రాష్ట్రానికి సంబంధించినది. సవరణల ప్రక్రియలో రాష్ట్రాలను సంప్రదించలేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రధానికి ఒక లేఖ రాశారు. ‘ప్రత్యేకించి ‘విద్యుత్‌’ ఒక అంశంగా భారత రాజ్యాంగ సమకాలీన జాబితాలో ఉన్నప్పుడు అటువంటి జాబితాలో ఏదైనా అంశంపై రాష్ట్రాలతో ముందస్తు సంప్రదింపులు అవసరం. ప్రస్తుత సందర్భంలో కొన్ని సంప్రదింపులకు సంబంధించి అస్పష్టత ఉంది. నిజమైన అభిప్రాయాల మార్పిడి లేదు. ఇది మన రాజ్యాంగ సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం’ అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లులో సూచించిన విధానం ‘లాభదాయకమైన పట్టణ-పారిశ్రామిక విభాగాలు’లో ప్రైవేట్‌ లాభం-కేంద్రీకృత యుటిలిటీ ప్లేయర్‌ల కేంద్రీకరణకు దారితీస్తుంది. అయితే పేద, గ్రామీణ వినియోగదారులను ప్రభుత్వ రంగ డిస్కమ్‌ల ద్వారా చూసుకునే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఇదిలాఉండగా, కేంద్ర విద్యుత్‌ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం ప్రకటనను ప్రశ్నించారు. సోమవారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘విద్యుత్‌ పంపిణీ రంగంలో పోటీ ఉండాలి. తద్వారా ప్రజలు తక్కువ ధరలకు మరింత సమర్థవంతమైన సేవను అందించే పంపిణీ సంస్థను ఎంచుకోవచ్చు’ అని సింగ్‌ చెప్పారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోమవారం మాట్లాడుతూ విద్యుత్‌ (సవరణ) బిల్లులోని నిబంధనలపై రాష్ట్రాలను సంప్రదించలేదని అన్నారు. ‘ఈ నిబంధనలు రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలకు ప్రమాదకరమైన గంటను మోగించాయి. ఈ విషయంలో మా పార్టీ సంప్రదింపులు జరుపుతోంది’ అని తెలిపారు. గత ఏడాది జులైలో విద్యుత్‌ మంత్రుల కాన్ఫరెన్స్‌ సమయంలో బీజేపీ మిత్రపక్షం జేడీ(యూ) అధికారంలో ఉన్న బీహార్‌ రాష్ట్రం కూడా విద్యుత్‌ రేట్ల పెంపు ఉంటుందని భయపడి విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించింది. తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాలు బిల్లులోని అనేక నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. విద్యుత్‌ రేట్లలో పెంపునకు భయపడి ప్రతిపక్ష పాలిత అనేక రాష్ట్రాలు బిల్లులో మార్పును వ్యతిరేకిస్తున్నాయి. సబ్సిడీ విద్యుత్‌ రేట్లను ముగించే చర్యను ఖండిరచాయి. బిల్లులో విద్యుత్‌ టారిఫ్‌ నిర్ధారణ నిబంధనను సవరించారు. ఇది చట్టంలోని సెక్షన్‌ 65 ప్రకారం ఎలాంటి సబ్సిడీ లేకుండా విద్యుత్‌ రిటైల్‌ విక్రయానికి సుంకం నిర్ణయించడానికి అన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్లను(ఎస్‌ఈఆర్‌సీలు) అడుగుతుంది. వినియోగదారుడికి నేరుగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ విద్యుత్‌లో డీబీటీని అమలు చేయడం కష్టమవుతుందనే కారణంతో రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి.
మరోవైపు విద్యుత్‌ రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహించారు. లాభదాయక రంగాన్ని ప్రైవేటీకరించడానికి మాత్రమే కేంద్రం ప్రభుత్వం మొత్తం విద్యుత్‌ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. విద్యుత్‌ చట్టానికి బిల్లు ద్వారా ప్రతిపాదించిన సవరణలు విద్యుత్‌ రంగ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని, కేంద్ర ప్రభుతష్ట్ర్వం ప్రజలకు సహాయం చేయడానికి బదులుగా ఇబ్బందుల్లోకి నెట్టడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img