Monday, August 8, 2022
Monday, August 8, 2022

వినయ్‌ విశ్వం అరెస్టు

భూపోరాటానికి సంఫీుభావం
అడ్డుకున్న పోలీసులు
హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత

వరంగల్‌: సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ వినయ్‌ విశ్వంను తెలంగాణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో సీపీఐ అధ్వర్యంలో చేపట్టిన పేదల భూపోరాటానికి సంఫీుభావం తెలిపేందుకు వెళుతున్న విశ్వంను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హనుమకొండలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిరది. సీపీఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వినయ్‌ విశ్వంను పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ… సీపీఐ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్‌ వ్యతిరేక నినాదాలతో సీపీఐ కార్యకర్తలు హోరెత్తించారు. ఆ తర్వాత పోలీసులు వినయ్‌ విశ్వంతో పాటు సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి సుబేధారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
కేసీఆర్‌కు పాలించే హక్కులేదు : వినయ్‌ విశ్వం
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ వినయ్‌ విశ్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో భూములు అన్యాక్రాంతం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్‌ లో కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని, ఇళ్లు లేని పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం అడ్డుకుంటోందన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చనందుకే ప్రజలు రోడ్డెక్కారని వినయ్‌ విశ్వం తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని నేరవెర్చలేని కేసిఆర్‌ కు పాలించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజా ఖండన…నిరసనలకు పిలుపు
తెలంగాణ పోలీసులు వినయ్‌ విశ్వంను అరెస్టు చేయడాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్రంగా ఖండిరచారు. అసలైన ప్రజాపోరాటాన్ని అణగదొక్కే తెలంగాణ ప్రభుత్వ చర్యలను పార్టీ సహించబోదని హెచ్చరించారు. వినయ్‌ విశ్వం అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని అన్ని రాష్ట్ర శాఖలకు పార్టీ పిలుపునిచ్చింది. వినయ్‌ విశ్వం అరెస్టు వార్త తెలిసిన వెంటనే రాజా తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఫోన్‌ చేసిన అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అక్రమంగా అరెస్టు చేశారు: చాడ
హనుమకొండలో సీపీఐ జాతీయ నేత, ఎంపీ బినోయ్‌ విశ్వంను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. సీపీఐ అధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాట ఉద్యమానికి సంఫీుభావం తెలపడానికి వినయ్‌ విశ్వం ఇక్కడికి వచ్చారని ఆయన చెప్పారు. ప్రజలను కలిసి, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడానికి వచ్చిన ఎంపీని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతల పేరుతో పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వినయ్‌ విశ్వం సహా పోలీసులు అరెస్ట్‌ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, వరంగల్‌, హనుమకొండ జిల్లా కార్యదర్శులు మేకల రవి, కర్రే బిక్షపతి, నాయకులు, పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img