Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

విమర్శకులను చాలా గౌరవిస్తాను : ప్రధాని మోదీ

భారత్‌ ఆత్మనిర్భర్‌ కావడం వల్లే వ్యాక్సినేషన్‌లో సక్సెస్‌ సాధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఓపెన్‌ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను మోదీ షేర్‌ చేసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సక్సెస్‌ కావడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తుందన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో బెడ్లు, వ్యాక్సిన్లు కొరత ఉన్నట్లు వచ్చిన వార్తలను మోదీ కొట్టిపారేశారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్న వయోజన జనాభాలో 69 శాతం మంది కనీసం ఒక డోసు అయిన వ్యాక్సిన్‌ తీసుకున్నారని, 25 శాతం మంది మాత్రం రెండు డోసుల టీకాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇదే రీతిలో డిసెంబర్‌ చివరి కల్లా యావత్‌ దేశాన్ని వ్యాక్సినేట్‌ చేయనున్నట్లు చెప్పారు. విమర్శలు వేరు..ఆరోపణలు వేరని అన్నారు. చాలా వరకు జనం ఎక్కువగా ఆరోపణలు మాత్రమే చేస్తారని, కానీ విమర్శలు చేయాలంటే, లోతైన అధ్యయనం, హార్డ్‌వర్క్‌ అవసరమన్నారు. నిజాయితీతో, మర్యాదపూర్వకంగా చెబుతున్నాను, విమర్శకులను చాలా గౌరవిస్తాను, కానీ కొన్ని సందర్భాల్లో తాను విమర్శకులను మిస్‌ అవుతున్నా అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img