వివేకా హత్య తర్వాత జగన్, భారతి సహాయకులకు ఫోన్లు వెళ్లాయన్న పట్టాభి
వీరిద్దరి పాత్రపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిలను సీబీఐ అధికారులు విచారించాలని టీడీపీ నేత పట్టాభి డిమాండ్ చేశారు. వివేకాను హత్య చేసిన వెంటనే భారతి సహాయకుడికి, జగన్ సహాయకుడికి వైఎస్ అవినాశ్ రెడ్డి నుంచి ఫోన్లు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. జగన్, భారతిలపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నప్పుడు వారిని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివేకా మృతదేహానికి కుట్లు వేయడానికి గంగిరెడ్డి ఆసుపత్రిలో పని చేస్తున్న ప్రకాశ్ రెడ్డిని తీసుకెళ్లారా? లేదా? చెప్పాలని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.