Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

జూన్ 30లోగా గంగిరెడ్డి విచారణ పూర్తి చేయాలని టీఎస్ హైకోర్టు ఆదేశం
జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలని ఉత్తర్వులు
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళ్తే… గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు… జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img