Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముగిసిన బిడ్డింగ్‌ల గడువు

. పాల్గొన్న 29 కంపెనీలు
. బిడ్డింగ్‌కు తెలంగాణ సర్కారు దూరం

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరుకు కోసం విశాఖ ఉక్కు నిర్వహించిన ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ల దాఖలుకు గురువారంతో గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏడు విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని కార్మికసంఘం నేత డి.ఆదినారాయణ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బిడ్డింగ్‌పై ఆసక్తి చూపలేదు. ఎన్‌ఎండీసీ వంటివి కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అధికారులు వెల్లడిరచారు. బిడ్ల కోసం గత నెల 27న ప్రకటన విడుదలైంది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. అప్పటి వరకు 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. తర్వాత బిడ్ల కోసం గడువును ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించారు. మరో ఏడు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. బిడ్‌ దాఖలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈవోఐ గడువు పెంచినా బిడ్జింగ్‌కి పెద్దగా స్పందన కనిపించలేదు. బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీలు లేనందున సింగరేణి సంస్థలను రంగంలోకి దించుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మంత్రులు సైతం విశాఖ ఉక్కును కాపాడతామని పదేపదే ప్రకటనలు గుప్పించారు. బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడంతో కేవలం రాజకీయ ప్రచారం కోసమే ప్రకటనలు చేసినట్లు ప్రజలు, రాజకీయ పార్టీలు అనుకుంటున్నారు. కార్మికసంఘాలు సైతం తెలంగాణ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాయి. సింగరేణి బిడ్‌ వేయక పోవడానికి కారణాలు చెప్పాలని కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలు ఫలించే పరిస్థితి కనిపిస్తోంది. ‘విశాఖ ఉక్కు’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిరది. ముడిపదార్థాల కొనుగోలుకు అవసరమైన నిధులు, కంపెనీ నిర్వహణకు అవసరమయ్యే మూలధనం (వర్కింగ్‌ క్యాపిటల్‌) కోసం నానా తిప్పలు పడుతోంది. ఉక్కు ఉత్పత్తిలో ఉన్న ఏదైనా కంపెనీ ఈ నిధులు సమకూరిస్తే అందుకు బదులుగా ఉక్కు సరఫరా చేస్తామని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖ ఉక్కు) ప్రకటించింది. ఇందుకు కంపెనీలు ఈ నెల 15వ తేదీలోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే.
ఆర్థికంగా కుంగతీసేందుకు కేంద్రం కుట్ర
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దాదాపుగా దివాలాకు దగ్గర్లో ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. ఇప్పుడు ‘నిధులకు స్టీల్‌’ ప్రతిపాదనకు ఎవరూ ముందుకు రాకపోతే దివాలాకు మరింత దగ్గరైనట్టేనని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా కుంగదీసి ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని, కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
స్టీల్‌ప్లాంట్‌కు రూ.22 వేల కోట్ల అప్పులు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నెత్తిన రూ.22 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి ఏటా రూ.2,200 కోట్ల వరకు అసలు, వడ్డీ చెల్లిస్తోంది. ఇది చాలదన్నట్టు పేరుకుపోతున్న వేల కోట్ల నష్టాలు కంపెనీని ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మరో ప్రభుత్వ రంగసంస్థ సెయిల్‌(స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)లో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో ప్లాంట్‌ భవిష్యత్తే ప్రమాదంలో పడిరది. దీంతో క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ప్రైవేటీకరణను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున పరోక్ష పద్ధతులు ఎంచుకుంది. ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలను నియమించడం ఆనవాయితీ. ఈ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు, యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది. ఈ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. అయినా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కలిపి 17 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 14,880కి పడిపోయింది. దాదాపుగా 13 శాతం తగ్గిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img