విశాలాంధ్ర`విజయవాడ : విజయవాడ నగర ప్రముఖులు, పాపులర్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషి, అమరులు చుక్కపల్లి పిచ్చయ్య ప్రథమ కుమారుడు, పాపులర్ షూ మార్ట్ ఎండీ చుక్కపల్లి అరుణ్‌కుమార్ విశాలాంధ్ర దినపత్రికకు రూ.లక్ష విరాళం అందించారు. ఈ నెల 22వ తేదీన విశాలాంధ్ర 70వ వార్షికోత్సవం నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న చుక్కపల్లి అరుణ్‌కుమార్ కార్యక్రమ నిర్వహణను చూసి సంతోషించి, విశాలాంధ్రకు రూ.లక్ష విరాళం అందజేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో రూ.లక్ష చెక్కును విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, విశాలాంధ్ర డెప్యూటీ జనరల్ మేనేజర్ టి.మనోహర్‌నాయుడుకు అందించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌కు జల్లి విల్సన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మరో రూ.13వేలు విరాళం
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మాజీ ఎడిటర్ ఏటూకూరి ప్రసాద్ రూ.5వేలు, రైతు నాయకుడు కూచిపూడి లక్ష్మీనారాయణ స్మారకార్థం ఆయన కుటుంబ సభ్యులు రూ.5వేలు, దేవులపల్లి రామారావు రూ.2వేలు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గుమ్మడి వెంకటరత్నం రూ.వెయ్యి చొప్పున విశాలాంధ్రకు విరాళాలు అందించారు. వీరికి కూడా జల్లి విల్సన్ అభినందనలు తెలిపారు.