Friday, August 12, 2022
Friday, August 12, 2022

వీసాదారులకు అమెరికా గుడ్‌న్యూస్‌..వర్క్‌ పర్మిట్‌ వీసా గడువు పొడిగింపు

భారతీయులతోపాటు వేలాదిమంది వలసదారులకు బైడెన్‌ సర్కార్‌ భారీ ఊరట కల్పించింది.వర్క్‌ పర్మిట్‌ వీసా గడువు ముగుస్తున్న కొన్ని క్యాటగిరీల వాళ్లకు మరో 18 నెలలపాటు పొడిగింపు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఇందులో గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు హెచ్‌-1బీ వీసాదారులు భాగస్వాములు కూడా ఉన్నారు.వీళ్లందరికీ మరో ఏడాదిన్నర కాలం పాటు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హోంల్యాండ్‌ సెక్యూర్టీ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ వలసదారులకు లబ్ధి చేకూర్చనున్నది. 180 రోజుల పొడిగింపును ఆటోమెటిక్‌గా 540 రోజులకు పెంచుతున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూర్టీ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img