Monday, June 5, 2023
Monday, June 5, 2023

వైఎస్సార్ ఇప్పుడు నిజంగా చనిపోయారు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు నిజంగా చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఇరుక్కున్న అవినాశ్ రెడ్డి గురించి ఆలోచిస్తూ జగన్, తెలంగాణలో పోలీసులను కొట్టిన షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజు టీవీల్లో కనిపించారని, వారి వల్ల వైఎస్సార్ పరువు పోయిందని అన్నారు. ఇవన్నీ చూసి వైఎస్సార్ నిజంగా ఇప్పుడు చనిపోయి ఉంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్‌కు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయని అన్నారు. వివేకా హత్య కేసును నాలుగేళ్లుగా సీబీఐ విచారిస్తోందని, చూస్తుంటే మరో ఏడాదిపాటు కొనసాగేలా ఉందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రామకృష్ణ మాట్లాడుతూ.. ముస్లింలు, దళితులు, ఇతర వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఆయన ఆ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, ధర్మవరం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img