Monday, October 3, 2022
Monday, October 3, 2022

వైఎస్సార్‌ ప్రారంభిస్తే.. సీఎం జగన్‌ తొలగించారు..

సీపీఐ నేత నారాయణ ఫైర్‌
వైద్యశాఖ మంత్రి విడదల రజినీ , తిరుపతి మేయర్‌ శిరీషాలు మహిళా ద్రోహులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు ఆందోళకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నేత నారాయణతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మహిళా ద్రోహి అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ప్రసూతి ఆస్పత్రిని.. నగర పాలక సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి మేయర్‌ శిరీషా కూడా మహిళా ద్రోహులని నారాయణ దుయ్యబట్టారు. ఇక్కడ నుంచి ప్రసూతి వైద్యశాలను తరలిస్తే ఊరుకునేది లేదని.. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రసూతి ఆస్పత్రి భవనాలను మారిస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.అలాగే, ఆస్పత్రిపై పెట్టిన నగర పాలక సంస్థ బోర్డును తొలగించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రసూతి ఆస్పత్రిని తిరుపతి నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మహిళలు చింపి, తగులబెట్టారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img