Friday, August 12, 2022
Friday, August 12, 2022

వైసీపీకి వైఎస్‌ విజయమ్మ రాజీనామా

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వైసీపీ పార్టీ నుండి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇకపై తన కుమార్తె, వైఎస్సార్‌ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. అయితే తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని విజయలక్ష్మి స్పష్టం చేశారు. జగన్‌, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారని, తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ అభిమానులు క్షమించాలని విజయలక్ష్మి కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img