స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్‌కార్డు తప్పనిసరి కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. టీకా కేంద్రాల్లో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటేనే అనుమతిస్తున్నారనే విషయమై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీంతోపాటు టీకా పోర్టల్‌లో సులభతరంగా ఉండేలా మార్పులు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ పిల్‌ను విచారించింది. కొవిడ్`19 వ్యాక్సినేషన్‌ను ఇచ్చే సందర్భంలో గుర్తింపునకు ఏకైక రుజువుగా ఆధార్ కార్డును సమర్పించాలని పట్టుబట్టవద్దని పేర్కొంది. పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ఆధార్ తప్పనిసరి కాదని, తొమ్మిది డాక్టుమెంట్లలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చని పేర్కొంది. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అని కేంద్ర ఆరోగ్యశాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఆరోగ్యశాఖ తరపున వాదించిన అడ్వకేట్ అమన్ శర్మ మాట్లాడుతూ.. 87 లక్షల మందికి ఎటువంటి ఐడీ కార్డు లేకుండానే టీకా ఇచ్చినట్లు చెప్పారు.