. సంక్షోభాన్ని పెంచుతున్న యుద్ధాలు
. ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లవ్ సేన్ గుప్తా
విశాలాంధ్ర, హైదరాబాద్: ప్రజలకు శాంతి అవసరం, అది లేకుండా అభివృద్ధి, సామాజిక న్యాయం, మంచి భవిష్యత్తు సాధ్యం కాదని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షులు పల్లవ్ సేన్ గుప్తా వక్కాణించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై సామ్రాజ్యవాద శక్తులు బెదిరింపులు పాల్పడుతూ ఆంక్షలు విధించడం వల్ల క్యూబా లాంటి అనేక దేశాలు ప్రమాదకరమైన దుస్థితిని ఎదుర్కొంటున్నా యని తెలిపారు. యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా మానవ జీవన వ్యయ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతిసంఘం అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన పల్లవ్ సేన్ గుప్తా ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత శాంతి, సంఫీుభావ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆయనను శాలువా, గజ పూలమాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత శాంతి, సంఫీుభావ సంఘం జాతీయ అధ్యక్షులు కె. యాదవ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు దిడ్డి సుధాకర్, ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెేవీఎల్, టీడీపీి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్ర శేఖరరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఏంఆర్‌జీ వినోద్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, లోక్‌సత్తా పార్టీ ఉపాధ్యక్షులు మెట్ల జగన్, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర నాయకులూ తిప్పర్తి యాదయ్య, కాచం సత్యనారాయణ, నాగేశ్వర రావు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్బంగా పల్లవ్‌సేన్ గుప్తా మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి గుర్తింపు పొందిన ప్రపంచ శాంతి సంఘం ‘‘శాంతికి అవును, యుద్ధానికి కాదు’’ అన్న నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పనిచేస్తున్నదని తెలిపారు. నిజమైన శాంతిని విశ్వసించే దేశాలు అంతర్జాతీయ సహకారం అందిస్తాయని, సామ్రాజ్యవాద దేశాలు ఆంక్షలను, యుద్ధాలను ప్రోత్సహిస్తాయని చెప్పారు. క్యూబాపై అమెరికా దిగ్బంధనాన్ని తక్షణమే ముగించాలని డిమాండ్ చేశారు. ఐరోపాలో జీవన పరిస్థితులు దిగజారుతున్నట్లు రుజువులు కనిపిస్తున్న నేపథ్యంలో రష్యా, ఉక్రేన్ దేశాలు తక్షణమే యుద్దాలు అపి, శాంతియుత చేర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. భారత దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఫాసిస్ట్ చర్యలు ప్రారంభమయ్యాయని, ప్రజాస్వామ్య రక్షణకు, సామాజిక పురోగతి కోసం శాంతియుతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యుద్ధాలకు ముగింపు పలకాలని, శాంతిని రక్షించాలని, శరణార్థులు, వలసదారుల హక్కులను కాపాడాలని ప్రపంచ శాంతి సంఘం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని పల్లవ్ సేన్ గుప్తా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి ప్రీతీ నిగమ్, ఐప్సో నాయకులూ ఉమా మహేశ్, బచ్చన్ సింగ్, టి. రాకేష్, జగన్ మోహనరావు, రఘుపాల్, నాగి రెడ్డి, కర్ర నగేష్ తదితరులు పాల్గొన్నారు.