Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

శాంతియుత మహోద్యమం

. సంయుక్త కిసాన్‌ మోర్చా సంకల్పం
. మద్దతు ధర అమలు సమస్యల పరిష్కారానికి డిమాండ్‌
. దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌ చలో విజయవంతం
. ప్రదర్శనల్లో పాల్గొన్న వేలాదిమంది రైతులు కొన్నిచోట్ల అరెస్టులు

న్యూదిల్లీ: అన్నదాతల సమస్యలపై శాంతియుత మహోద్యమానికి సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సంకల్పించింది. ఇందులో భాగంగా రాజ్‌భవన్‌ చలోకు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని రాష్ట్రాల్లో భారీస్థాయిలో ప్రదర్శనలు నిర్వహించింది. మహిళలు, వృద్ధులు సహా వేలాది మంది రైతులు పాల్గొన్నారు. కేంద్రరాష్ట్ర పాలకలకు రైతు సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టారు. పెండిరగ్‌ సమస్యల తక్షణ పరిష్కారానికి డిమాండ్‌ చేశారు. మద్దతు ధర అమలు హామీ, నష్ట పరిహారం చెల్లింపులు ఎప్పుడని నిలదీశారు. లఖింపూర్‌ దోషులకు శిక్షలు ఎప్పుడు విధిస్తారని ప్రశ్నించారు. ఏడాదికిపైగా సాగిన రైతుల మహోద్యమానికి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అదే స్ఫూర్తితో ఎస్‌కేఎంతో పాటు అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌ చలో కార్యక్రమం విజయవంతం అయింది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు వినతిపత్రాలను రైతుల ప్రతినిధులు అందజేశారు. సమస్యల సత్వర పరిష్కారానికి డిమాండ్‌ చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని పంజాబ్‌ ఆజాద్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కమిటీ అధ్యక్షుడు నిర్వైల్‌ సింగ్‌, భారతీ కిసాన్‌ యూనియన్‌, దకుండా ప్రధాన కార్యదర్శి జగ్‌మోహన్‌ సింగ్‌ తెలిపారు. పంజాబ్‌లోని బర్నాలా, సంగ్రూర్‌, మాన్స, భటిండా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌, ఫజిల్కా, ముక్తసర్‌, తరన్‌తరణ్‌, పాటియాలా, ఫతేఘర్‌ సాహిబ్‌, మోగా, లూథియానా, కపూర్తలాకు చెందిన రైతులు మొహాలీకి చేరుకొని భారీ ప్రదర్శనగా రాజ్‌భవన్‌కు కదం తొక్కారు. పంజాబ్‌ నిరసనల్లో బీకేయూ ఉగ్రహాన్‌, కుల్‌ హింద్‌ కిసాన్‌సభ, కీర్తి కిసాన్‌ యూనియన్‌, పంజాబ్‌ కిసాన్‌ యూనియన్‌, క్రాంతికారి కిసాన్‌ అయూనియన్‌ పంజాబ్‌, బీకేయూ (లఖోవాల్‌) సంఘాలతో పాటు 32 యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నేతృత్వంలో మొహాలీలోని గురుద్వారా అంబ్‌ సాహిబ్‌ నుంచి చండీగఢ్‌లోని పంజాబ్‌ రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చండీగఢ్‌ సరిహద్దు వద్ద రైతులను పోలీసులు అడ్డుకోవడంతో గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసేందుకు ప్రతినిధులు మాత్రమే వెళ్లారు. తమ సమస్యలతో పాటు పెండిరగ్‌ అంశాల సత్వర పరిష్కారాన్ని కోరారు. రైతుల ఆందోళన క్రమంలో మొహాలీలో వెయ్యి మంది పోలీసులను మోహరించినట్లు చండీగఢ్‌ ఎస్పీ వెల్లడిరచారు. చండీగఢ్‌మోహాలీ సరిహద్దు మూసివేసినట్లు తెలిపారు.
మెరుగైన కిసాన్‌ బీమా కోసం బెంగాల్‌ రైతుల డిమాండు
కనీస మద్దతు ధర, విద్యుత్‌ చట్టం ఉపసంహరణ, లఖింపూర్‌ ఖేరి ఘటనకు నిరసనల క్రమంలో రైతులపై నమోదైన తప్పుడు కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను బెంగాల్‌ రైతులు చేశారు. కిసాన్‌ బీమా పేరిట నకిలీ యోజనను రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన పథకాన్ని అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత అవీక్‌ సాహా డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్నది మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. తన హయాంలో రైతుల ఆదాయాన్ని మూడురెట్టు పెరిగిందని సీఎం మమతా బెనర్జీ చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే రైతులకు కిసాన్‌ బంధు యోజన కింద రూ.5వేలు లేక రూ.10వేలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? వారు మెరుగైన విధంగా పన్నులు చెల్లించగలగాలి కదా! అమె చెప్పేది మాటలకే పరిమితం’ అని సాహా వ్యాఖ్యానించారు. కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బాగుకు ఏమీ చేయడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img