Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సచివాలయం యూనిట్‌గా ఇంటింటా టీకా

కరోనాపై అప్రమత్తత తప్పదు
విద్యాసంస్థల్లో ఎస్‌వోపీలు పాటించాలి
ఎంఎస్‌ఎంఈలకు మూడున ప్రోత్సాహకాలు
అక్టోబరు 25నుంచి ఆప్షన్‌ 3 ఇళ్ల నిర్మాణం
స్పందన సమీక్షలో సీఎం జగన్‌

అమరావతి : కోవిడ్‌తో సహజీవనం చేయక తప్పదని, వైరస్‌ తీవ్రత ఎలా ఉన్నా నిబంధనలు కచ్చితంగా పాటించడమే నివారణకు సరైన మార్గమని ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌, సీజనల్‌ వ్యాధులు, ఉపాధిహామీ పనులు, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌, ఇళ్ల స్థలాల పంపిణీ, 90 రోజుల్లోగా ఇంటిస్థలం కేటాయింపు, ఇళ్ల నిర్మాణంతోపాటు ఖరీఫ్‌ సీజన్‌, వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కుభూరక్ష, పరిశ్రమలపై సీఎం బుధవారం సమీక్షించారు. కోవిడ్‌ మార్గదర్శకాలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకా ణాలు, ఇతర సముదాయాలకు జరిమానాలు విధిం చాలని, పెళ్లిళ్లలో 150కి మించకుండా చూడాల న్నారు. పాఠశాలలు ప్రారంభమైనందున విద్యా సంస్థల్లో ఎస్‌ఓపీలను తప్పకుండా పాటించా లన్నారు. లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని, ఇంటింటికీ సర్వేలు కొనసాగాలని సూచించారు. 104 అనే నంబరు ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావా లని, ఇది చాలా సమర్థవంతంగా పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. కరోనా మూడో వస్తుందో, లేదో తెలియదని, అయినా మనం సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలన్నారు. 80 శాతం ప్రజలకు డబుల్‌డోస్‌ ఇచ్చేంతవరకూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ఇంటింటా టీకాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబరు 25 నుంచి మూడో ఆప్షన్‌ ఎంపిక చేసు కున్న ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు సెప్టెంబరు 3న ప్రోత్సాహకాలు విడుదల చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. కలెక్టర్లు నెలలో ఒకరోజు ఎంఎస్‌ఎంఈలకు, మరో రోజు ఇతర పరిశ్రమలకు కేటాయించాలని, వారితో మాట్లాడి సమస్యలు తెలుసు కోవడం ద్వారానే పారిశ్రామికరంగం ప్రగతి సాధిస్తుందని మార్గనిర్దేశనం చేశారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, లేకపోతే రిజర్వేషన్‌కు అర్థం ఉండదన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారో 90 రోజుల్లోగా వివరాలు సేకరించాలని, తర్వాత నియామక ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యం) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, అడిషనల్‌ డీజీపీ ఏ రవిశంకర్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img