Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సహోద్యోగులపై జవాన్‌ కాల్పులు..నలుగురు మృతి

ఒక జవాన్‌ తోటి సైనికులపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) జవాన్లు మరణించారు.. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాజిల్లా మారాయిగూడ పోలీసుస్టేషను పరిధిలోని లింగాలపల్లిలో సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చోటుచేసుకుంది. రీతేష్‌ రంజన్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ కాల్పులు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించగా, మరో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనపై సీఆర్‌పీఎఫ్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img