Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

సాధారణ వ్యాధిలా బలహీనపడిన కొవిడ్‌ : నిపుణులు

ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారి దేశంలో బలహీనపడిరదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారని, దీంతో ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిందని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న కారణంగా వైరస్‌ను అడ్డుకునేందుకు రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడిరదని..ఈ మహమ్మారి సాధారణ వ్యాధిలా బలహీనపడిరదని స్పష్టంచేస్తున్నారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా దేశంలో కరోనా వైరస్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. నేటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వంటి కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాలను ఉచితంగా అందిస్తుండగా.. ప్రైవేట్‌ సెక్టారులో మాత్రం నిర్దిష్టమైన ధరలకు కరోనా వ్యాక్సిన్‌ అందిస్తున్నారు.130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా మొదటి డోసు, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్‌ డోస్‌లను వేయించుకున్నారు.దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వంతు పాత్ర పోషించాయి. అయితే, ఇందులో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే చిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌లో మిన్నగా ఉన్నాయి.అలాగే గుజరాత్‌, కేరళ, దిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం దాదాపు 90 శాతం మంది మొదటి తొలి డోసు వేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img