Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

సామరస్య`నిర్మాణాత్మక దౌత్యంతోనే పరిష్కారం

అంతర్జాతీయ శాంతికి విఘాతం
సరిహద్దుల్లో సైనిక మోహరింపు వద్దు
తాజా పరిణామాలపై ఐరాస భద్రతా మండలి అత్యవసర భేటీలో భారత్‌

న్యూదిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సమస్యలను సంయమనంతోనే పరిష్కరించుకోవాలని, ఇందు కోసం సామరస్యపూర్వక నిర్మాణాత్మక దౌత్యం అవసరమని భారత్‌ సూచించింది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిణా మాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రతరం కాకుండా తక్షణ చర్యలు అనివార్యమని నొక్కిచెప్పింది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా రెండు దేశాల సరిహద్దుల వద్ద పరిణామాలు శాంతిభద్రతలను దెబ్బతీసేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర భేటీలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ పరిధిలోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రమైనవిగా రష్యా సోమవారం గుర్తించిన నేపథ్యంలో స్పందించిన భారత్‌ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే ప్రపంచం తట్టుకోలేదని పేర్కొంది. ఉక్రెయిన్‌` రష్యా సరిహద్దు వెంబడి పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఉద్రిక్తతను తగ్గించడమే తక్షణావశ్యమని నొక్కిచెప్పింది. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని దేశాలు దీర్ఘకాలంగా చేస్తున్న కృషి దృష్ట్యా తగు చర్యలను తక్షణమే తీసుకోవాలని, సైనిక మోహరింపు వద్దని హితవు పలికింది. త్వైపాక్షిక ఒప్పంద సంఘం, నార్మాండీ ఫార్లట్‌ ద్వారా జరుగుతున్న కసరత్తును భారత్‌ స్వాగతించింది. నార్మాండీ ఫార్మట్‌ పరిధిలోనే అత్యవసర సమావేశానికి ఉక్రెయిన్‌ పిలుపునిచ్చింది. తాజా పరిణామాలపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి (పీఆర్‌) టీఎస్‌ త్రిమూర్తి స్పందించారు. ‘ఉక్రెయిన్‌కు సంబంధించిన పరిణామాలను, తూర్పు సరిహద్దు వద్ద జరుగుతున్నదీ గమనిస్తున్నాం. రష్యా ఫెడరేషన్‌ ప్రకటన లను కంట కనిపెట్టి ఉన్నాం’ అని అన్నారు. మిన్స్‌ ఒప్పందంలో పేర్కొన్నవి అమలు చేసేలా రాజీ కుదిర్చేలా గట్టి కసరత్తు అవసరమని చెప్పారు. నిర్మాణా త్మక దౌత్యం ద్వారానే యుద్ధ పరిస్థితిని నివారించగలమని నొక్కిచెప్పారు. పౌరభద్రత కీలకమని, 20వేల మంది భారతీయ విద్యార్థులనుద్దేశించి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలగనివ్వకుండా చూసుకో వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు. సామరస్యంగా సమస్య పరిష్కారయయ్యేలా దౌత్యపరమైన కసరత్తు తీవ్రతరం కావాలని, ఉద్రిక్తత నివారణకు అందరూ సంయమనం పాటించాలని త్రిమూర్తి సూచించారు. ఇదిలావుంటే, తమ పరిధిలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించే పనిలో రష్యా ఉండటంతో ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ఉక్రెయిన్‌ పిలుపునిచ్చింది. మాస్కోలో టీవీ మాధ్యమంగా ఇచ్చిన సందేశం తర్వాత ఉక్రెయిన్‌లోని డోన్టెస్క్‌, లుగాంన్కెక్‌ను పీపుల్స్‌ రిపబ్లిక్స్‌గా గుర్తిస్తూ ఉత్తర్వులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకాలు చేశారు. ఆ రెండు ప్రాంతాల నాయకులతో స్నేహం, సహకారం, పరస్పర సయోధ్య ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక మోహరింపునకు ఆదేశాలు జారీచేశారు. తాజా పరిణామంపై స్పందించిన అమెరికా, ఆ రెండు ప్రాంతాలపై ఆంక్షలు విధించింది. రష్యా తీరును ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తప్పుపట్టారు. ఈ వైఖరి ఉక్రెయిన్‌ సార్వభౌమత్వా నికి, ఐరాస చార్టర్‌ సూత్రాలకు విరుద్ధమన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా బలగాల మోహరింపు ఆదేశాలపై విచారాన్ని ఐరాస రాజకీయ, శాంతి నిర్మాణానికి ప్రధాన కార్యదర్శి రోస్‌మేరి డికార్లో వ్యక్తంచేశారు. ఈనెల 1820 తేదీల్లో డోంబస్‌ ప్రాంతంలో 3,231సార్లు కాల్పుల ఉల్లంఘన జరిగినట్లు న్యూయార్క్‌లో చోటుచేసుకున్న మండలి సమావేశంలో డికార్లో వెల్లడిరచారు. కాగా, ఉక్రెయిన్‌ విషయమై ఐరాస భద్రతా మండలి భేటీ కావడం ఈ ఏడాదిలో ఇది మూడవ సారి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img