Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ వస్తోంది..

అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఈ సంస్థ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారత్‌లో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్‌ అవసరం లేకుండా నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాజాగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది.ప్రజలకు తమ సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ అందించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img