Friday, December 1, 2023
Friday, December 1, 2023

సింధు ఓదార్చిన తీరుకు.. కన్నీళ్లొచ్చాయి: తై జు

సెమీస్‌లో తన చేతిలో ఓడిన సింధు ఫైనల్స్‌ ముందు తనను ఎంతగానో ప్రోత్సహించిందంటూ ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి తై జుయింగ్‌ పెట్టిన పోస్టు భారత అభిమానులను ఆకట్టుకుంది. పీవీ సింధు ఓదార్చిన తీరుకు తనకు కన్నీళ్లు ఆగలేదని తైజుయింగ్‌ తెలిపింది. రజతం గెలిచినందుకు సంతోషించాలో..స్వర్ణం చేజారినందుకు బాధపడాలే తెలియని స్థితిలో ఆమె ఓదార్చిన తీరుకు నాకు కన్నీళ్లొచ్చాయి. ‘ఫై˜ౖనల్‌లో నా ఆట సంతృప్తిగానే అనిపించింది. మ్యాచ్‌ ముగిశాక సింధు నా వద్దకు వచ్చి కౌగిలించుకుని.. నువ్‌ బాగా ఆడావ్‌, కానీ ఈ రోజు నీది కాదు అని నన్ను హత్తుకుని ఓదార్చింది…సింధు మద్దతుకు, ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు’’ అని ఇన్‌స్టా ఖాతాలో తైజు పోస్ట్‌ చేసింది.ఆదివారం చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫీ చేతిలో తై జుయింగ్‌ ఓటమి పాలయి రజతంతో సరిపెట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img