Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

సీఆర్‌ స్ఫూర్తితో ప్రజాపోరాటాలు

. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పిలుపు
. వాడవాడలా 29వ వర్ధంతి

విశాలాంధ్ర`శేరిలింగంపల్లి: భూపోరాటయోధ, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి చండ్ర రాజేశ్వరరావు జీవితం స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు 29వ వర్ధంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా కమ్యూ నిస్టుశ్రేణులు సీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి ఫౌండేషన్‌ చీఫ్‌ పాట్రన్‌, సీపీిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఫౌండేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, కూనంనేని సాంబశివరావు, ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శి పీజే చంద్రశేఖరరావు, చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, ప్రజాపక్షం ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, సీఆర్‌ ఫౌండేషన్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రజిని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్‌్‌ డి. కృష్ణకుమారి, ఆర్‌ మేనియా మాజీ రాయబారి టి.సురేశ్‌, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ జంధ్యాల ప్రభాకర్‌, వేములపల్లి కిరణ్‌ తదితరులు పూల మాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు భౌతికంగా మన వద్ద లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో మనందరిలో ఉన్నాడని అన్నారు. సీఆర్‌ సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే ఆయన పేరు మీద సిఆర్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే సీఆర్‌ ఫౌండేషన్‌ను నిర్వహించి అందులో వృద్ధాశ్రమాన్ని, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం, మహిళా సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు సోమూరి తుకారాం, డాక్టర్‌ పి.సరస్వతి, రాజేంద్ర రావు, మేనేజర్‌ శ్రీనివాస్‌, వృద్ధాశ్రమ వాసులు, సీనియర్‌ సినీ నటులు కాకరాల, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img