Friday, June 2, 2023
Friday, June 2, 2023

సీఎంపై ఉత్కంఠే

అధిష్ఠానానిదే నిర్ణయం: సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం
18న సీఎం, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కర్నాటకలో అఖండ విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ పార్టీ త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం బెంగళూరులోని 5స్టార్‌ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానం చేసే సంప్రదాయం కాంగ్రెస్‌లో ఉంది. తాజాగా అదే జరిగింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడిని నియమించే చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షునికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సీఎం ఎవరో వెల్లడిరచకుండా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీని కాంగ్రెస్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సీఎంతో పాటు నూతన మంత్రివర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భావసారుప్యత కలిగిన పార్టీలకు సైతం కాంగ్రెస్‌ ఆహ్వానాలు సైతం పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నాటక మంత్రివర్గం కూర్పునకు ఒకట్రెండు రోజుల్లో తుది రూపం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రమాణ స్వీకారోత్సవానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖడ్గే తదితరులు హాజరుకానున్నారు. మరోవైపు సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం ముగ్గురు నేతలతో కూడిన పరిశీలకుల బృందాన్ని బెంగళూరుకు పంపింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు సుశీల్‌ కుమార్‌ షిండే, దీపక్‌ బాబరియా, జితేంద్ర సింగ్‌ అల్వార్‌ను పరిశీలకులుగా కర్నాటక సీఎల్పీ నియమించింది. ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై చివరి నిర్ణయాన్ని అధ్యక్షుడికి వదిలేస్తూ తీర్మానించింది.
సరైన నిర్ణయమే తీసుకుంటాం: ఖడ్గే
కర్నాటక ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లకార్జున ఖడ్గే తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో వివాదం లేదని అన్నారు. కర్నాటకలోని పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు అధిష్ఠానానికి తెలియజేస్తారని, ఆపై తుది నిర్ణయం

జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి సరైన నిర్ణయాన్నే తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపోయాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటవుతుందని అన్నారు. ఎవరు ఓటేశారు.. ఎవరు కాదన్న దానికి కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇవ్వదని, కర్నాటక ప్రజలకు సేవ చేయడమే పార్టీకి ప్రధానమని ఖడ్గే నొక్కిచెప్పారు.మంత్రివర్గం కొలువుదీరిన రోజే ఎన్నికలప్పుడు ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తామన్నారు. గతం గతహా అంటూ ఎన్నికలప్పుడు జరిగిన ఘటనలనుద్దేశించి అన్నారు. కర్నాటక రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.
ఎవరి ప్రయత్నాలు వారివే…
సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విధేయులైన ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా హరిహరపుర మఠానికి చెందిన వక్కళిగ సాధువులు డీకే శివకుమార్‌ ఇంటికెళ్లి ఆయనను కలిశారు. తుముకూరులోని సిద్ధేశ్వర మఠాన్ని డీకే శివకుమార్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. మరోవైపు సిద్దరామయ్య…ఖర్డే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.
మా నాయకుడే సీఎం కావాలి: మద్దతుదారులు
కాంగ్రెస్‌ సమావేశం జరిగిన హోటల్‌ వద్దరు ఇద్దరు సీనియర్‌ నాయకులు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య మద్దతుదారులు భారీఎత్తున చేరుకొన్నారు. తమ అభిమాన నాయకుడికే ఉన్నత పదవి దక్కాలని ఇద్దరు నేతల సానుకూల వర్గాలు నినాదాలు చేశాయి. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రతిష్ఠంభన మరింత జఠిలమైంది. ఓ వైపు పోస్టల జోరు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img