Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌యూఎస్‌ నిరసనలు

విజయవాడ : ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్వర్యంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బుధవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శ నలు, బహిరంగ సభలు నిర్వహించారు. జోరువాన, పోలీసుల నిర్భంధాలను లెక్కచేయకుండా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యా యులు పాల్గొని నిరసన ప్రదర్శనలను జయప్రదం చేశారు. గతంలో ఫ్యాప్టో అధ్వర్యాన నాలుగుసార్లు ‘చలో అసెంబ్లీ’లు నిర్వహించి, సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు నిర్వహించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్రలో అనేకసార్లు తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలో, శాసనసభలోను తీర్మానం చేశారు. అయితే, వాటిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్న నేపథ్యంలో టక్కర్‌ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయటానికి మంత్రులు, అధికారులతో కమిటీలు నియమించి కాలయాపన చేస్తున్నారు. కేఏ పండిట్‌ కన్సల్టేషన్‌తో మరొక కమిటీ వేయడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు పోరాడతామని, పెన్షన్‌ బిక్ష కాదు, పెన్షన్‌ హక్కుగా పోరాడి సాధించుకునేంత వరకు ఉద్యమాలను చేపడతామని నాయకులు స్పష్టంచేశారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే ఉద్యమాలను తీవ్రం చేస్తామని స్పష్టంచేశారు. ఫ్యాప్టో చైర్మన్‌ సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు (గుంటూరు), సెక్రటరీ జనరల్‌ చేబ్రోలు శరత్‌చంద్ర (మచిలీపట్నం), కో-చైర్మన్లు నక్కా వెంకటేశ్వర్లు (ఒంగోలు), కె.భానుమూర్తి (శ్రీకాకుళం), కె.కులశేఖర్‌రెడ్డి (అనంతపురం), వెలమల శ్రీనివాసరావు (మచిలీపట్నం), చందోలు వెంకటేశ్వర్లు (విశాఖపట్న్లం), కార్యదర్శి కె.ప్రకాశరావు (కర్నూలు), కోశాధికారి జి.శౌరిరాయులు (గుంటూరు), కార్యవర్గ సభ్యులు సీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ (చిత్తూరు), పి.పాండురంగవరప్రసాదరావు (మచిలీపట్నం), జి.హృదయరాజు, (కర్నూలు), జి.నారాయణరెడ్డి (కడప), కె.నరహరి (పశ్చిమ గోదావరి జిల్లా), పర్రె వెంకటరావు (ప్రకాశం జిల్లా), కేజీఎస్‌ గణపతి(విజయనగరం) నరోత్తమరెడ్డి (చిత్తురు జిల్లా) 13 జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగిన నిరసన, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (అనంతపురంలో), కత్తి నరసింహారెడ్డి (కడప జిల్లా), కేఎస్‌ లక్ష్మణరావు (గుంటూరు జిల్లా), ఐ.వెంకటేశ్వరరావు (తూర్పు గోదావరి జిల్లా), పాకలపాటి రఘువర్మ (విజయనగరం జిల్లా) షేక్‌ సాబ్జీ (పశ్చిమ గోదావరి జిల్లా) నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఫ్యాప్టోకు సంఫీుభావం తెలిపారు. ఏపీజేఏసీ చైర్మన్‌, ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఒంగోలులో, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గుంటూరులో, ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు ఎంసీ దాస్‌, సెక్రటరీ ఎం.రవికుమార్‌ తూర్పు గోదావరి జిల్లాలో, ఆర్థిక కార్యదర్శి ఎస్‌.రత్తయ్య గుంటూరు జిల్లాలో పాల్గొన్నారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్లు, సెక్రటరీ జనరల్‌లు తమ జిల్లాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img