Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

సీబీఎస్‌ఈ ట్వల్త్‌ ఫలితాలు – 99.37శాతం ఉత్తీర్ణత

బాలికలదే హవా
మెరిట్‌ జాబితా ఉండదన్న బోర్డు
టాపర్లుగా దివ్యాన్షి జైన్‌, తుషార్‌ సింగ్‌

న్యూదిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ట్వల్త్‌ (12వ తరగతి) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికల హవా కనిపించింది. ఉత్తీర్ణత సాధించిన బాలురు 99.13శాతంగా ఉంటే బాలికలు 99.67శాతంగా ఉన్నారు. దివ్యాంగ విద్యార్థులు సైతం అద్భుత ప్రతిభను కనబర్చగా వారిలో 99.69శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. మొత్తంగా 13,04,561 మంది పరీక్షకు హాజరు కాగా 12,96,318 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే 0.54శాతం మెరుగ్గా బాలికల ప్రదర్శన ఉందంటూ సీబీఎస్‌ఈ ప్రకటన పేర్కొంది. 95 శాతం మార్కులకు మించి సాధించిన వారు 70,004 మంది ఉన్నారని, టాప్‌ స్కోరర్లు 5.37శాతం మేర ఉన్నారని వెల్లడిరచింది. 9095శాతం మధ్యశ్రేణిలో మార్కులు సాధించిన విద్యార్థులు 11.51 శాతం అంటే 150,152 మంది ఉన్నట్లు తెలిపింది. దివ్యాంగులలో 10.19శాతం మంది 9095శాతం మార్కులు సాధించగా 3.29శాతం మంది 95శాతానికిపైగా స్కోర్‌ చేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది 6,149 మంది కంపార్ట్‌మెంట్‌ పరీక్ష రాయాల్సి ఉన్నట్లు వెల్లడిరచింది. ఇక విదేశీ విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం 99.92శాతంగా ఉన్నట్లు తెలిపింది. 17,016 మంది పరీక్ష రాస్తే 17,003 మంది పాస్‌ అయినట్లు సీబీఎస్‌ఈ వెల్లడిరచింది. ఈ ఏడాదికి మెరిట్‌ జాబితాను తయారు చేయడం లేదని, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ సాధించిన విద్యార్థుల పేర్లను ప్రకటించడంగానీ మెరిట్‌ పత్రాలు ఇవ్వడంగానీ జరగదని ప్రకటించింది. ఇదిలావుంటే, సీబీఎస్‌ఈ ట్వల్త్‌ టాపర్లుగా 600కుగాను 600 మార్కులను సాధించి దివ్యాన్షి జైన్‌ (లక్నోలోని నవయుగ్‌ రేడియన్స్‌ సీనియర్‌ సెంకడరీ స్కూల్‌), తుషార్‌ సింగ్‌ (డీపీఎస్‌ బులంద్‌షహర్‌) నిలిచారు. 97.67 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నాయి. కాగా, టెన్త్‌ మార్కుల్లో 30 శాతం, 11వ తరగతి తుది ఫలితాల్లో 30 శాతం, 12వ తరగతిలో నిర్వహించిన యూనిట్‌ పరీక్ష/మిడ్‌-టర్మ్‌/ ప్రీ-బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం వెయిటేజీ ఇస్తూ తుది ఫలితాలను సీబీఎస్‌ఈ వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img