Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

సుప్రీంకు మహా సంక్షోభం

రెబెల్స్‌ నిర్ణయం
బీజేపీ నేతలతో షిండే రహస్య మంతనాలు
అనేక చోట్ల అనుకూల`వ్యతిరేక ఆందోళనలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై అనర్హత వేటును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. శివసేన శాసనసభ పక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే స్థానంలో అజయ్‌ చౌదరిని నియమించడాన్ని, డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని తిరుగుబాటు వర్గం సవాల్‌ చేసింది. అదే సమయంలో ఏక్‌నాథ్‌ షిండే బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఆయన ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేన కార్యకర్తలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్ధవ్‌ వర్గానికి, షిండే వర్గానికి మధ్య పరస్పరం విమర్శలు పెరుగుతున్నాయి. ‘మీరు పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి’ అంటూ సీఎం ఉద్ధవ్‌ సవాల్‌ చేశారు. సొంత తండ్రుల పేర్లు వాడుకోవాలని, బాలాసాహెబ్‌ ఠాక్రే పేరు కాదని దుయ్యబట్టారు. తిరుగుబాటు వర్గంలో ఉన్న వారు ఆత్మ చచ్చిన జీవచ్ఛవాలని, తిరిగొచ్చాక శవాలను పోర్టుమార్టం కోసం అసెంబ్లీకి పంపుతారు. రగిల్చిన చిచ్చు పరిణామం వారికి తెలియనిది కాదు’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు షిండే కార్యాలయం వద్ద అనుకూల వర్గం ఆందోళన చేసింది. ఉద్ధవ్‌ ఠాక్రే దిష్టిబొమ్మలను షిండే వర్గం దహనం చేసింది. శివసేన కార్యకర్తలు ఏక్‌నాథ్‌ షిండే థానే కార్యలయంతో పాటు అనేక మంది తిరుగుబాటు నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. చెప్పులతో కొట్టండి అంటూ నినదించారు. పూనేలోని బలగంగాధర్వ ఆడిటోరియం, కోద్రుడ్‌ స్థానాల్లో ఆందోళనలు జరిగాయి. ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితిపై న్యాయ సలహా కోసం మహారాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ అశుతోష్‌ కుంభాకోణిని అసెంబ్లీ కార్యదర్శి పిలిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి షిండే మద్దతిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామదాస్‌ అథావలే వెల్లడిరచారు. ఇదిలావుంటే, దమ్ముంటే శివసేన ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటూ తిరుగుబాటు వర్గానికి శివసేన నేతలు ఆదిథ్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌ సవాల్‌ విసిరారు. ఈ సంక్షోభాన్ని మహా వికాస్‌ అగాడీ (ఎంవీయే) అధిగమించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఎంవీయే భాగస్వాముల నుంచి పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని, నమ్మకం ఉంచండి అంటూ శివసేన కార్యకర్తనుద్దేశించి షిండే ట్వీట్లు చేయడాన్ని రౌత్‌ దుయ్యబట్టారు. తిరుగుబాటు వర్గంలోనూ తిరుగుబాటు జరగవచ్చు అని పరోక్షంగా హెచ్చరించారు. ముంబైకి తిరిగొస్తే అంతా తెలుస్తుందన్నారు. శివసేన`బాలాసాహెబ్‌ పేరును ఆ వర్గం వాడేందుకు వీల్దేన్నారు. బలవంతంగా ఉంచారు కాబట్టి గువహటిలోఉన్న తిరుగుబాటు నేతలు పరస్పరం దాడులు చేసుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. తిరిగొస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో షిండేను బీజేపీ సీఎం చేస్తుందేమో చూద్దాం అంటూ రౌత్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలతో షిండే అర్థరాత్రి రహస్య మంతనాలు జరగడంపై ‘దమ్ముంటే నీ తండ్రి లేదా వడోదర, సూరత్‌, దిల్లీలోని తండ్రుల పేర్లు మీద ఓట్లు అడ్డుక్కో’ అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img